కరెంట్​పై కట్టుకథలు చెప్పడం మానండి : కవిత

కరెంట్​పై కట్టుకథలు చెప్పడం మానండి : కవిత

హైదరాబాద్, వెలుగు :  కరెంట్ పై కట్టుకథలు చెప్పడం మానాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ ​రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. మోదీ ప్రభుత్వం.. రామగుండం ఎన్టీపీసీ నుంచి తెలంగాణ మొత్తానికి కరెంట్​సరఫరా చేస్తున్నదని కిషన్​రెడ్డి చేసిన ట్వీట్​కు కవిత కౌంటర్​ఇచ్చారు. రాష్ట్రంలో 15,500 మెగా వాట్ల కరెంట్ ​డిమాండ్​ ఉంటే ఎన్టీపీసీ నుంచి ఇచ్చేది కేవలం 680 మెగావాట్లు ఆమె ట్వీట్ చేశారు. స్టేట్​ డిమాండ్​లో 4% మాత్రమే ఎన్టీపీసీ నుంచి ఇస్తున్నారని వివరించారు. కేంద్రమే నిరంతరం కరెంట్​ ఇస్తుందనే అబ ద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్​కృషితోనే తెలంగాణలో కరెం ట్​కష్టాలు తీరాయన్నారు. లోటు నుంచి మిగు లు రాష్ట్రంగా చేసిన ఘనత సీఎంది అన్నారు.