V6 News

లాల్ దర్వాజా ఆలయ విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ కవిత డిమాండ్

లాల్ దర్వాజా ఆలయ విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ కవిత డిమాండ్

గురువారం ( డిసెంబర్ 11 ) లాల్ దర్వాజా ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాల్ దర్వాజా ఆలయ విస్తరణ పనుల కోసం రూ. 10 కోట్లు కేటాయించినప్పటికీ, డబ్బులు విడుదల కాలేదన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాల్ దర్వాజా ఆలయ విస్తరణ పనుల కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల కు పెంచుతూ,  అదే రోజు జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాగ్దానం చేసినప్పటికీ నేటికీ నిధులు విడుదల కాలేదన్నారు కవిత. 

లాల్ దర్వాజా ఆలయ విస్తరణ కోసం ఇండ్లు కోల్పోయే వారు కూడా ఇండ్లు ఖాళీ చేయడానికి, అదే విధంగా ఆలయ కమిటీ కూడా ఆలయ విస్తరణ పనుల కోసం ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఐదు ఇండ్లను కోల్పోతున్న బాధితులకు వెంటనే చెక్కులు పంపిణీ చేసి, అమ్మవారి ఆలయ అభివృద్ధి కి కృషి చేయాలని డిమాండ్ చేశారు. 

రూ. 10 కోట్లు కాదు రూ. 20 కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పది, ఇరవై ఏమి ఇవ్వలేదన్నారు. ఒకవైపు ఆకాశనంటుతున్న ధరలను దృష్టి లో పెట్టుకొని, వెంటనే లాల్ దర్వాజా ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు కవిత.