మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత

మేడారం సమ్మక్క,సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రామప్పలో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ అభివృద్ధితో రామప్ప యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలిపారు. మేడారానికు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటిది కాదని, గతంలో పార్లమెంట్ లో కూడా డిమాండ్ చేశామని ఆమె గుర్తు చేశారు. రామప్ప పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి సాధిస్తాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చాకా, రామప్పకు యూనెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.రామప్ప గుడిలో ఎక్కువ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండదని కవిత స్పష్టం చేశారు.రామప్పగుడి చుట్టు కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్ ములుగు గిరిజన ప్రజల కష్టం చూసిన వ్యక్తని.. అందుకే ములుగును జిల్లా చేశారని కవిత అన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకీ ల్యాండ్ ఇచ్చామని.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాదో చూడాలన్నారు. ములుగుకు మెడికల్ కాలేజీలో వచ్చే ఏడాది అకాడమీక్ ఇయర్ క్లాస్ లు ప్రారంభం అవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు 100 కోట్ల ఇచ్చామని తెలిపారు. అలాగే తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీని 1800 కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. ములుగు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో 137 కోట్లతో కరకట్టలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ డాక్టర్ ఉన్నాడు..ఇది కేసీఆర్ ఘనత అని కవిత చెప్పుకొచ్చారు. ములుగు జిల్లాను హెల్త్ ప్రోఫైల్ కోసం ఎంచుకున్న జిల్లా.. చాలా గర్వకారణం అన్నారు. నెక్స్ట్ న్యూట్రిషన్ కిట్టు కోసం ములుగు జిల్లానే ఎంచుకున్నారని తెలిపారు. తెలంగాణను ప్రపంచం పటంలో నిలిపిన జిల్లా.. ములుగు జిల్లా అని కవిత ప్రశంసించారు.