
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కేంద్రం దేశవ్యాప్తంగా సింగరేణిని ప్రైవేటు పరం చేస్తోందని, తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాయకుడికి విల్ పవర్.. దక్షత ఉండాలని, అవన్నీ ఉన్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. వారసత్వ ఉద్యోగాలను అడ్డుకున్న వారు ఎవరో కార్మిక లోకం ప్రజలకు తెలియజేయాలని కోరారు. రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు వస్తున్న బెనిఫిట్స్ దేశవ్యాప్తంగా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సింగరేణి కార్మికులను చైతన్య పర్చాలన్నారు. వారసత్వ ఉద్యోగాలు పొందిన 18 వేల మంది యువకులు బాధ్యతగా భావించాలని కోరారు. బీజేపీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి.. రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.