గ్రీన్ జర్నీ పేరుతో ప్రజలను దోచుకుంటున్నరు

గ్రీన్ జర్నీ పేరుతో  ప్రజలను దోచుకుంటున్నరు
  • సిటీ బస్సు చార్జీల పెంపుపై కవిత విమర్శలు

హైదరాబాద్​, వెలుగు: సామాన్య ప్రజలంటే ఎందుకంత కోపమని సీఎం రేవంత్​ రెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సిటీ బస్సు టికెట్ చార్జీలను పెంచడంపై ఆదివారం ఆమె ట్వీట్​ చేశారు. ‘‘మొన్నటికి మొన్న సిటీ బస్ పాస్ ల ధరలు భారీగా పెంచి చిరుద్యోగులు, సిటీ ప్రజలపై పెనుభారం మోపారు. ఇప్పుడు బస్ చార్జీలను అమాంతం పెంచేశారు. బస్సు ఎక్కడమే పాపం అన్నట్టుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు’’ అని ఆమె ‘ఎక్స్’ లో​విమర్శించారు.