దేశ చరిత్రలో ఎక్కడా లేదు: దేవాలయాల అభివృద్ధి కోసం బడ్జెట్ లో భారీ ప్యాకేజీ

దేశ చరిత్రలో ఎక్కడా లేదు: దేవాలయాల అభివృద్ధి కోసం బడ్జెట్ లో భారీ ప్యాకేజీ

జగిత్యాల జిల్లా : దేవాలయాల అభివృద్ధి కోసం బడ్జెట్ నుంచి అధిక ప్యాకేజీ కేటాయిస్తున్నామని.. ఈ ప్యాకేజీ దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గురువారం ఆమె కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడిన మీడియాతో మాట్లాడిన కవిత..  అంజన్నను దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న అన్నారు.  కరోనా మహమ్మారి తెలంగాణా దరిదాపుల్లోకి రాకుండా స్వామివారి దయ ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు.

కొండగట్టు దేవాలయంలో భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రజల్లో హనుమాన్ నామస్మరణ చెయ్యాలనే భావన తెలంగాణ వ్యాప్తంగా వచ్చిందని చెప్పారు. హనుమాన్ నామ సంకీర్తన కార్యక్రమం పెద్దఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామని..కాశీలోని సంకట హనుమాన్ దేవాలయాన్ని దర్శించినప్పుడు వారు కొండగట్టు ఆలయం ప్రాశస్త్యం వివరించారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పఠనం చెయ్యాలని సూచించిన కవిత..ఆ దిశగా హనుమాన్ చాలీసా సంకీర్తన కార్యక్రమం చెయ్యాలని సకల్పించి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధితో పాటుగా చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు కవిత.