పిటి రెడ్డి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొస్తం: ఎమ్మెల్సీ కవిత

పిటి రెడ్డి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొస్తం: ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రం గర్వించదగ్గ ప్రముఖ చిత్రకారుడు పిటి. రెడ్డి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కళనే తన జీవితంగా ఆయన జీవించారని ఆమె గుర్తు చేశారు. ఆయన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొస్తామన్నారు. ఆనాటి అందమైన కళాకృతులను వారి కూతురు అపురూపంగా కాపాడుకొస్తున్నారని కవిత చెప్పారు. పిటి. రెడ్డి 108వ జయంతి సందర్భంగా నారాయణగూడలోని పిటి. రెడ్డి గ్యాలరీని కవిత సందర్శించారు. పిటి రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం గ్యాలరీలోని చిత్రాలు, స్క్లప్చర్ ఆర్ట్‭ని ఆమె తిలకించారు. 

పిటి. రెడ్డి టెక్నిక్స్‭ని నేటి తరం కళాకారులు అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. పిటి రెడ్డికి తగిన గుర్తింపు కోసం ప్రభుత్వం తరపున తమ వంతు ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ కళాకారులు ఈ ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా ఆర్ట్ మీద మరింత పట్టు సాధించవచ్చని ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు.