ఎమ్మెల్సీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్..రూ.5 కోట్లు ఇవ్వాలని మిర్జా రహమత్ బేగ్‌‌‌‌‌‌‌‌ కు బెదిరింపులు

ఎమ్మెల్సీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్..రూ.5 కోట్లు ఇవ్వాలని మిర్జా రహమత్ బేగ్‌‌‌‌‌‌‌‌ కు బెదిరింపులు
  • నార్సింగి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్‌‌‌‌‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే డీప్‌‌‌‌‌‌‌‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తామని బెదిరించినట్లు ఎమ్మెల్సీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2026 ఆగస్టు 26న గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఇంటర్నెట్, డేటా కాల్స్ ద్వారా తనకు బెదిరింపులు వచ్చినట్లు ఎమ్మెల్సీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు  చేయగా కేసు నమోదైంది. తాజా ఫిర్యాదులో హైదరాబాద్ యూత్ కరేజ్(హెచ్‌‌వైసీ) సంస్థకు చెందిన సల్మాన్ ఖాన్‌‌‌‌‌‌‌‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.