ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినూత్న నిరసన 

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినూత్న నిరసన 
  • అసెంబ్లీ, మండలి జాయింట్ సెషన్ లో స్పెషల్ అట్రాక్షన్  

హైదరాబాద్, వెలుగు: వివిధ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తేవడంలో టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినూత్న ప్రయత్నం చేశారు. తన కారుపైనే ఆయా సమస్యలను రాసుకుని శుక్రవారం అసెంబ్లీ, మండలి జాయింట్ సెషన్ కు వచ్చారు. వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ రేడియం స్టిక్కర్ తో చేసిన అక్షరాలను అతికించి, తీసుకొచ్చిన ఆ కారు స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. కేజీబీవీ, యూఆర్ఎస్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు, ఉద్యోగులకు మినిమం బేసిక్ పే వర్తింపచేయాలని, అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్వహణకు కేర్ టేకర్​ను నియమించాలని కారుపై రాయించారు. సీపీఎస్ అమలుకు కారణమైన పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కూళ్లలో శానిటేషన్ పనులను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు చేయలేకపోతున్నాయని, ఆ పనుల కోసం విద్యా శాఖ ద్వారా నియామకాలు చేపట్టాలని కోరారు.