బ్రాహ్మణులకు మంత్రి పదవులియ్యాలె

బ్రాహ్మణులకు మంత్రి పదవులియ్యాలె

‘బ్రహ్మాస్మి’ వెబ్ సైట్ ప్రారంభ కార్యక్రమంలో రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: బ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించాలని బీజేపీ ఎమ్మెల్సీ రాంచదర్ రావు అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తోందన్నారు. బ్రాహ్మణులు14 రాష్ట్రాల్లో కేబినెట్ మంత్రులుగా ఉన్నారని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రాహ్మణులకు  కేబినెట్ లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ బొగ్గుల కుంటలోని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆఫీసులో పరిషత్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి రాంచందర్ రావు ‘బ్రహ్మాస్మి’ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తోందన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఎంతో మంది పేద బ్రాహ్మణులకు చేయూతను అందిస్తున్నామన్నారు. బ్రాహ్మణులు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో  బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, దేవీ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. బ్రాహ్మణులకు చేయూతనిచ్చేందుకు వెబ్ సైట్ ను ఏర్పాటు చేయడంపై బ్రహ్మాస్మి సంస్థ ఫౌండర్ వరుణ్ కుమార్ ను నేతలు అభినందించారు.

For More News..

అప్పుడు దుబ్బాక, హైదరాబాద్.. ఇప్పుడు ఓరుగల్లు

రాష్ట్రంలో ఫస్ట్ రౌండ్‌‌ వ్యాక్సిన్‌‌ 2,67,246 మందికి

రిజిస్ట్రేషన్లు పాత పద్ధతి అని హైకోర్టుకు చెప్పి.. కొత్త పద్ధతిలో ప్రారంభించిన సర్కార్