తెలంగాణ ఏర్పాటు తరువాత ఇదే మొదటిసారి

తెలంగాణ ఏర్పాటు తరువాత ఇదే మొదటిసారి

బడ్జెట్ సమావేశాలు ఇంత తక్కువ రోజులు జరగడం తెలంగాణ ఏర్పాటు తరువాత ఇదే మొదటిసారి అని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత సమావేశాల పనిదినాలను కూడా తగ్గించారని ఆయన అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ పని తీరును కాగ్ తప్పు బట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందని కాగ్ తన రిపోర్ట్‌లో  తేల్చింది. దీని వల్ల మరో 20 ప్రాజెక్టులు పక్కనబెట్టారని చెప్పింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి తక్కువ కేటాయింపులు చేసినట్టు కాగ్ వెల్లడించింది. రాష్ట్రంలో విలువైన భూముల రికార్డులు లేవని ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. దేవాలయ భూములు అన్యాక్రాంతం అయినట్లు కాగ్ చెప్పింది. రాష్ట్రంలో ఆర్థిక గందరగోళం నెలకొంది. Sc,st సబ్‌ప్లాన్ నిధులు దారిమల్లుతున్నాయి. తామే గొప్ప పనులు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అందరినీ తప్పుదారి పట్టిస్తోంది. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? బడ్జెట్ సమావేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు కాగ్ రిపోర్ట్ అద్దం పడుతోంది. కాగ్ రిపోర్ట్‌తోనైనా కేసీఆర్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి’ అని ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు.