బీఆర్ఎస్ లీడర్లపై సర్కారు కక్ష సాధింపు : ఎమ్మెల్సీ తాతా మధు

బీఆర్ఎస్ లీడర్లపై సర్కారు కక్ష సాధింపు : ఎమ్మెల్సీ తాతా మధు

ఖమ్మం టౌన్, వెలుగు :  కాంగ్రెస్​ ప్రభుత్వం బీఆర్ఎస్ లీడర్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. గురువారం పార్టీ జిల్లా ఆఫీస్​లో వారు మీడియాతో మాట్లాడారు. జీళ్లచెర్వు డైరెక్టర్ ఇంటూరి శేఖర్ అరెస్ట్ ను ఖండించారు. గత పదేండ్లుగా పాలన ఎలా ఉందో.. 

Also Read: మెదక్​ జిల్లాలో 4లక్షల 42 వేల 891 ఓటర్లు

ఈ రెండు నెలల్లో ఏం జరుగుతోందో ప్రజలు గమనించాలన్నారు. జీఓ నంబర్ 58, 59తో ఎవరు లబ్ది పొందారో వివరాలు బయటికి తీయాలని రెవెన్యూ మంత్రిని డిమాండ్ చేశారు. తనకు, ఇంటూరి శేఖర్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడాన్ని తాతా మధు ఖండించారు. సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తానన్నారు.