- సీసీ కెమెరాలతో గుర్తించి, వాళ్లతోనే ఖర్చు పెట్టిస్తాం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్థలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తే చర్యలు తీసుకుంటామని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. సోమవారం బోడుప్పల్సర్కిల్ శ్రీ సాయి ఎన్‌క్లేవ్, రాజశేఖర్ కాలనీ, మల్లయ్య నగర్, వీరా రెడ్డి నగర్ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. మల్లయ్య నగర్ లో ప్రభుత్వ భూముల్లో భవన నిర్మాణ వ్యర్థాలు పారవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ స్థలాల్లో వ్యర్థాలు డంప్ చేస్తున్న వారిపై సీరియస్యాక్షన్తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వ్యర్థాలు పారవేస్తున్న వెహికిల్స్ ను సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించాలన్నారు. దొరికిన వారి వాహనాలు సీజ్‌చేసి పారవేసిన చెత్తను వారి ఖర్చుతోనే తొలగింపజేస్తామన్నారు. శ్రీ సాయి ఎన్‌క్లేవ్ లో అర్బన్ బయోడైవర్సిటీ పనులను పరిశీలించారు.

