మా మద్దతు బీజేపీకే .. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ

మా మద్దతు బీజేపీకే .. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ

ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు మాదిగల మద్దతు బీజేపీకేనని మాదిగ రిజర్వేషన్​ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. స్వయంగా దేశ ప్రధానే మాదిగల సభకు వచ్చి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించడం అభినందనీయమన్నారు. దళితుడినే సీఎం చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ ​మాటతప్పారన్నారు.

11 శాతం ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని, ఒక్క శాతం ఉన్న వెలమలకు నాలుగు, రెడ్లకు ఏడు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మాదిగ సామాజిక వర్గానికి 12 టికెట్లు, ఉపకులాలకు రెండు టికెట్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్​ కూడా మాదిగ వర్గానికి చేసిందేమీ లేదన్నారు. వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కనీసం మాట్లాడకుండా వెళ్లిపోయారన్నారు. బీసీని సీఎం చేస్తానంటున్న బీజేపీకి ఓటు వేయాలన్నారు.