ఘట్కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు.. టైమింగ్స్ ఇవే

ఘట్కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు.. టైమింగ్స్ ఇవే

ఘట్కేసర్ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. 2024, మార్చి 6వ తేదీ బుధవారం నుంచి ఘట్ కేసర్ టు లింగంపల్లికి ఎంఎంటీఎస్ సర్వీలు అందుబాటులోకి రానున్నాయి. మార్చి 5వ తేదీ మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో ఘట్కేసర్ లింగంపల్లి మధ్య నూతన ఎంఎంటీఎస్ రైల్ ను మాజీ మంత్రి మల్లరెడ్డి, ఎమ్మెల్సీ ఏవి ఎన్ రెడ్డి, రైల్వే అధికారి బర్తేష్ కుమార్ జెండా ఉపి ప్రారంభించారు.

ఈ సంధర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఘట్ కేసర్ నుండి వయ సనత్ నగర్ మీదుగా లింగంపల్లి వరకు  రెండు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని తెలిపారు. దీంతో ఎన్నో ఏండ్ల కల నెరవేరిందన్నారు.తాను ఎంపిగా ఉన్నపట్టి నుండి ఘట్ కేసర్-లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైల్ కోసం ప్రయత్నించానని చెప్పారు. ఈ రైళ్లు రావడానికి కృషి చేసిన రైల్వే ఉద్యోగులకు, ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలిపుతున్నానని చెప్పారు మల్లారెడ్డి.

కాగా..  ఉదయం, సాయంత్రం వేళలో ఈ ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నాయి. ఉదయం 7 గంటల 20 నిమిషాలకు ఎంఎంటీఎస్ రైలు బయల్దేరి ఉదయం 9గంటల 15 నిమిషాలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఇక, సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు లింగంపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఘట్ కేసర్ కు చేరుతుంది.