ఒకే ట్రాక్ పై రెండు ఎంఎంటీఎస్ రైళ్లు...ఇది ఫేక్

ఒకే ట్రాక్ పై  రెండు ఎంఎంటీఎస్ రైళ్లు...ఇది ఫేక్

హైదరాబాద్ మలక్ పేట్ రైల్వే స్టేషన్ లో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చాయన్న వార్తలు అవాస్తమని తేలింది.   ఒకే ట్రాక్ పైకి రైళ్లు  ఎదురెదురుగా రాలేదని..అవన్నీ  తప్పుడు ప్రచారమని  సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. వీటిన్ని ప్రజలు, ప్రయాణికులు నమ్మొద్దని కోరారు. 

హైదరాబాద్ మలక్ పేట్ రైల్వే స్టేషన్ లో ఎంఎంటీఎస్ కు పెను ప్రమాదం తప్పిందని జులై 24 నుంచి వార్తలు షికారు చేశాయి. మలక్ పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒకే ట్రాక్ పైకి రైళ్లు  ఎదురెదురుగా వచ్చాయని... అప్రమత్తమైన లోకో పైలట్లు ట్రైన్లను దూరంగా ఆపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వార్తలు వినిపించాయి.  దీంతో రెండు రైళ్లు అరగంటకు పైగా ట్రాక్స్ పైనే ఉండిపోయాయట. దీంతో కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని... ఆ తర్వాత  రూట్ క్లియర్ చేసి మరో ట్రాక్ పై ఒక రైలును మళ్లించారని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి.