
న్యూఢిల్లీ: మొబీక్విక్ పేమెంట్ గేట్‌వే విభాగం జాక్‌పే పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం పొందింది. ఫలితంగా ఆన్‌లైన్ చెల్లింపులను వేగంగా, సులభంగా ప్రాసెస్ చేయడానికి కొత్త వ్యాపారులను తన ప్లాట్‌ఫారమ్‌లోకి చేర్చుకోవడానికి వీలుంటుంది. జాక్‌పే ఈ–-కామర్స్, మొబిలిటీ, బిల్లు చెల్లింపుల కోసం ప్రముఖ బ్రాండ్లతో కలిసి పనిచేస్తుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ వంటి ఎన్నో రకాల పేమెంట్స్‌ను అనుమతిస్తుంది.