4 గంటల పాటు మొబైల్​ ఇంటర్నెట్​ నిలిపివేత

4 గంటల పాటు మొబైల్​ ఇంటర్నెట్​ నిలిపివేత

గువాహటి: అస్సాంలోని 25 జిల్లాల్లో 4 గంటల పాటు మొబైల్‌‌ ఇంటర్నెట్‌‌ సేవలను నిలిపివేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆదివారం గ్రేడ్‌‌ 4 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో అభ్యర్థులు మాల్‌‌ప్రాక్టీస్‌‌కు పాల్పడకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం మొబైల్‌‌ ఇంటర్నెట్‌‌ సేవలను నిలిపివేసింది. దాదాపు 30 వేల పోస్టులు ఖాళీగా ఉన్న గ్రేడ్‌‌ 3, 4 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 14.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వీటిని ఆగస్టు 21, 28, సెప్టెంబర్‌‌‌‌ 11న నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌‌ రిలీజ్‌‌ చేసింది. ఎగ్జామ్‌‌ జరిగే రోజుల్లో మొబైల్‌‌ ఇంటర్నెట్‌‌ సేవలను నిలిపివేయాలని ఆయా టెలికాం సంస్థలకు సీఎం హిమంత బిశ్వశర్మ ఆగస్టు 17న ఆదేశాలిచ్చారు. మాల్‌‌ ప్రాక్టీస్‌‌ను నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.