బలహీన వర్గాల జీవనోపాధి పెంచేందుకు... మొబైల్ మైగ్రేషన్ హెల్పింగ్ సెంటర్ ప్రారంభం

బలహీన వర్గాల జీవనోపాధి పెంచేందుకు... మొబైల్ మైగ్రేషన్ హెల్పింగ్ సెంటర్ ప్రారంభం
  • లాంఛనంగా స్టార్ట్  చేసిన మంత్రి తుమ్మల
  • వలస కుటుంబాలకు సహాయం కోసం ప్రత్యేక వాహనం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వలసదారులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమాభివృద్ధి, వారి జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు ‘మొబైల్  మైగ్రేషన్​  హెల్పింగ్​ సెంటర్​’  ను ప్రభుత్వం ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్  ఆర్గనైజేషన్  ఫర్  మైగ్రేషన్ (ఐఓఎం) , ఫుడ్  అండ్  అగ్రికల్చర్  ఆర్గనైజేషన్ (ఎఫ్‌‌ఏఓ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య​అతిథిగా హాజరై ప్రారంభించారు. 

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఈ వాహనాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి, ఎంపిక చేసిన ప్రాంతాల రైతులకు సాయిల్  టెస్ట్‌‌లు, సేంద్రీయ వ్యవసాయ విధానాలు నిర్వహిస్తామన్నారు. పశుపాలనపై వర్చువల్  శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. మైగ్రేషన్  కుటుంబాల్లో మహిళలు తరచూ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతున్నారని, అలాంటి మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలు అందించేందుకు ఈ మొబైల్ వాహనం ఉపయోగపడుతుందన్నారు.