ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బుధవారం పలుచోట్ల చిరు జల్లులు కురువగా, కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మెంగారం, శెట్పల్లి సంగారెడ్డి, సంగారెడ్డి, లింగంపేట, తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్; దేవాయిపల్లి, కాలోజివాడి, కృష్ణాజీవాడిలో వడ్ల కుప్పలు, దేవాయిపల్లిలో మక్కలు తడిసిపోయాయి. బీర్కుర్, నస్రుల్లాబాద్ మండలాల్లో రోడ్ల పక్కన అరబోసిన వడ్లు తడిశాయి. పిట్లం మండలంలో సెంటర్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి.
నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో వడ్ల రాసులు తడిసి పోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు సెంటర్లు, రోడ్లపై ఆరబోసిన వడ్ల కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కొన్నచోట్ల డ్రోన్సాయంతో వడ్లను
ఆరబెట్టుకున్నారు. --కామారెడ్డి/వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
