మోదీ కేబినెట్లో కొత్తవాళ్లు వీళ్లే..

మోదీ కేబినెట్లో  కొత్తవాళ్లు వీళ్లే..

మోదీ  కేబినెట్‌లో 72 మందికి చోటు కల్పించారు.  ఇందులో మిత్రపక్షాల నుంచి 11 మంది ఉన్నారు.  కేబినెట్ లో  30 మందికి కేబినెట్ హోదా కల్పించారు. మొత్తం 39 మందికి గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మరో 23 మంది రాష్ట్ర అసెంబ్లీలో మంత్రులుగా చేశారు. 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు చొప్పున ఎస్టీ, మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన నేతలకు అవకాశం కల్పించారు మోదీ.

అయితే  మోదీ కేబినెట్ లో  కొందరు కొత్తవారికి కేంద్రమంత్రులుగా అవకాశం దక్కింది. మధ్యప్రదేశ్ మాజీసీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జితన్ రాం మాంజి,  రాజీవ్ రంజన్ సింగ్,  చిరాగ్ పాశ్వన్, సీఆర్ పాటిల్, ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, తెలంగాణకు చెందిన బండి సంజయ్ ఉన్నారు.