ఉగ్రవాదంపై కలిసి పోరాడుదాం

ఉగ్రవాదంపై కలిసి పోరాడుదాం

న్యూఢిల్లీ: పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన షహబాజ్ షరీఫ్ కు భారత ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన హెచ్ఈ మియాన్ ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు. ఇండియా ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపడం ద్వారా మనం అభివృద్ధిపై పోకస్ పెట్టొచ్చు. ఇది మన ప్రజలకు ఎంతో శ్రేయస్కరం’ అని మోడీ ట్వీట్ చేశారు. 

కాగా.. ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించి.. షెహబాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి అయ్యే వరకు పాకిస్థాన్ అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. సుప్రీంకోర్టు తీర్పుతో  ప్రధాని ఎన్నిక కోసం  పాక్ నేషనల్ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్.. పీటీఐ సభ్యుల రాజీనామాతో ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఓటింగ్ నిర్వహించింది.  దాదాపు 12 గంటల పాటు జరిగిన చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్ లో షహబాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని పదవి కోసం పీటీఐ నుంచి షా మహమ్మద్‌ ఖురేషీ, పీఎంఎల్ఎన్ నుంచి షహబాజ్‌ షరీఫ్‌ పోటీపడ్డారు. అయితే పీటీఐ సభ్యుల మూకుమ్మడి రాజీనామాతో ప్రభుత్వం కుప్పకూలింది. ఖురేషీకి సభ్యుల మద్దతు లేకుండా పోయింది. దీంతో షహబాజ్ షరీఫ్ ఎన్నిక సుగమమైంది.
 

మరిన్ని వార్తల కోసం...

ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

పాక్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించండి