ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ప్రధాని మోడీ. కశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరుక్ అబ్దుల్లాతో కలిసి ఏపీలో చంద్రబాబు ప్రచారం చేయడమేంటి? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. ఫరుక్ అబ్దుల్లా మాటలకు కాంగ్రెస్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు దేశభక్తులో..ఎవరు పాకిస్తాన్ ఏజెంట్లో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ ఉన్నంత వరకు ఇలాంటి విభజన వాదుల ఆటలు సాగవని హెచ్చరించారు. దేశం కోసం దృడమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు.
