గాంధీ నగర్ – ముంబయి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం

గాంధీ నగర్ – ముంబయి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం

గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గాంధీ నగర్, ముంబయి సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించారు. గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలును అధికారికంగా ప్రారంభించారు.  అనంతరం వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో అహ్మదాబాద్ వరకు ప్రయాణించారు. ఆయనతో పాటు సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. ఉద్యోగులు, మహిళలు, వ్యాపారులు, యువకులు ప్రధానితో కలిసి ప్రయాణించారు. గాంధీ నగర్, ముంబయి సెంట్రల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు నడవనుంది. 

ప్రధాని ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ దేశంలో మూడోవది. 16 కోచ్ లు ఉన్న ఈ ట్రైన్ లో 1128 మంది ప్రయాణించే అవకాశముంది. మిగిలిన రెండు రైళ్లతో పోలిస్తే ఈ ట్రైన్ లో సౌకర్యాలను మరింత మెరుగుపరిచారు. రిక్లైనింగ్ సీట్లు, ఆటోమేటిక్ ఫైర్ సెన్సార్లు, సీసీటీవీ కెమెరాలు, వైఫై తదితర సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు.