ఈ-వేలానికి మోడీ గిఫ్ట్స్, మెమెంటోలు

V6 Velugu Posted on Sep 20, 2021

కొన్నేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చిన గిఫ్ట్స్, మెమెంటోలు ఈ-వేలంకు రానున్నాయి. ఈ వేలానికి సంబంధించి నిన్న ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తనకు వచ్చిన కానుకలను వేలం వేస్తున్నామని అందులో పాల్గొనాలని కోరారు. ఈ గిఫ్ట్స్ అమ్మగా వచ్చిన డబ్బులన్నీ... గంగానది ప్రక్షాళనకు ఖర్చు చేస్తామని తెలిపారు. కొద్ది సంవత్సరాలుగా తనకు ఎందరో ఎన్నో కానుకలు ఇచ్చారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒలింపిక్ హీరోలు ఇచ్చిన ప్రత్యేక మెమొంటోలు, వారు వాడిన వస్తువులు కూడా ఉన్నాయని తెలిపారు. వాటిని ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తున్నట్లు తెలిపారు. 
 

Tagged pm modi, gifts, e auction, , Mementos

Latest Videos

Subscribe Now

More News