దేవెగౌడకు పుట్టినరోజు గ్రీటింగ్స్ చెప్పిన మోడీ

దేవెగౌడకు పుట్టినరోజు గ్రీటింగ్స్ చెప్పిన మోడీ

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కర్నాటక జనతాదళ్ సెక్యులర్ చీఫ్ హెచ్​డీ దేవెగౌడ 87వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దేవెగౌడ దీర్ఘాయువు, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నానంటూ మోడీ సోమవారం ట్వీట్ చేశారు. 1933 లో జన్మించిన దేవెగౌడ 1996 జూన్​ నుంచి 1997 ఏప్రిల్ వరకు మన దేశానికి 11వ ప్రధానిగా పనిచేశారు. అంతకు ముందు 1994 నుంచి 1996 వరకు కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. గెహ్లాట్​జీ కి శుభాకాంక్షలు. దేవుడు సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా”అని ట్వీట్ చేశారు.