
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈ సాయంత్రం రెండోసారి ప్రమాణం చేశారు. బీజేపీ అభిమానులు, మోడీ అభిమానులు దేశమంతటా పండుగ చేసుకున్నారు.
గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన ప్రముఖులతో పాటు, అన్ని పార్టీల జాతీయ నాయకులు హాజరయ్యారు. తమ ప్రియతమ నేత మరోసారి ప్రధాని కావడంతో ఆ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీలో చూస్తూ నిమగ్నమయ్యారు.
ప్రధాని మాతృమూర్తి హీరాబెన్ కూడా తన కొడుకు ప్రమాణ స్వీకారాన్ని అహ్మదాబాద్ లోని తన ఇంట్లో టీవీలో వీక్షించారు. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో.. టీవీలో ఆయన్ను చూసి, చప్పట్లు కొట్టి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.