కరోనా కష్టకాలంలో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది

కరోనా కష్టకాలంలో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది

ప్రపంచాన్ని నడిపే సత్తా తమకుందని భారత యువత నిరూపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఐఎస్ బీ హైదరాబాద్ 20వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్న ఆయన అక్కడి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయ్ జాతికి అంకితం చేసిన ఐఎస్ బి ఇప్పుడు ఆసియాలోని టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచిందని చెప్పారు. ఐఎస్ బీ లో ఇప్పటి వరకు శిక్షణ తీసుకున్న 50వేల మంది దేశ విదేశాల్లో బడా బడా కంపెనీలను నడుపుతున్నారని చెప్పారు. స్టార్టప్ లు, యూనికార్న్ ల నిర్మాణంలోనూ వారి భాగస్వామ్యం ఉండటం దేశానికి గర్వకారణమని మోడీ అభిప్రాయపడ్డారు.

దేశాభివృద్ధిలో ప్రభుత్వం యువతను భాగస్వాములను చేస్తోందని ప్రధాని మోడీ చెప్పారు. వచ్చే 25 ఏళ్ల రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని, యువతకు అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రకటించారు. జీ 20 దేశాల్లో భారత్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మారిందన్న మోడీ.. స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు. ఇంటర్నెట్ యూజర్లు, గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లో రెండో స్థానంలో ఉన్న భారత్.. ప్రపంచ స్టార్టప్ ఎకో  సిస్టంలో, కన్యూమర్ మార్కెట్ లో భారత్ మూడో స్థానంలో ఉందని ప్రకటించారు. 

కరోనా కష్టకాలంలో భారత్ సామర్థ్యం ప్రపంచానికి  తెలిసిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇండియా అంటేనే బిజినెస్ అనే స్థాయికి భారత్ చేరుకుందని చెప్పారు. భారత్ అభివృద్ధి కేంద్రంగా మారుతున్నందున గతేడాది రికార్డు స్థాయిలో ఎఫ్డీఐలు వచ్చాయని చెప్పారు. ఇది ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని, యువత భాగస్వామ్యంతోనే సాధించగలిగామని మోడీ అభిప్రాయప్డడారు.
అంతుకు ముందు ఐఎస్బీ ప్రాంగణంలో మోడీ మొక్క నాటారు. అనంతరం 20వ వార్షికోత్సవ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు తన చేతుల మీదుగా మోడీ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

For more news..

మూఢనమ్మకాలు నమ్మేవాళ్లు తెలంగాణను ఉద్ధరించలేరు

తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా