తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా

తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా

తెలంగాణలో కుటుంబ పాలన చేసేవాళ్లు దేశ ద్రోహులంటూ ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వాగత సభలో పాల్గొన్నినారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు. ‘పట్టుదలకు తెలంగాణ ప్రజలు పెట్టింది పేరు’ అని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఏ లక్ష్యం కోసం అమరులు ప్రాణ త్యాగాలు చేశారో.. ఆ ఆశయాలు ఇంకా నెరవేరలేదన్నారు. కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్న విషయాన్ని రు. కుటుంబ పాలన కారణంగా యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావడం లేదని మోదీ అభిప్రాయపడ్డారు. కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించడమే తన సంకల్పమని స్పష్టం చేశారు.

కుటుంబపాలన ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి  కుంటుపడిందన్న ప్రధాని మోడీ..తెలంగాణ భవిష్యత్తు, గౌరవం కోసం బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మోడీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ గా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటోందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను బీజేపీ కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.యువతతో కలిసి రాష్ట్రాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలపై దాడుల అంశం తన దృష్టికి వచ్చినట్లు మోడీ తెలిపారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి  చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికారు.

హైదరాబాదే నాకు టర్నింగ్ పాయింట్
‘‘ 2013 సంవత్సరాన్ని నేను మరువలేను.  అప్పుడు నేనొక సామాన్య గుజరాత్ బీజేపీ కార్యకర్తను. ఆ ఏడాది హైదరాబాద్ లో కొత్త చరిత్ర లిఖితమైంది. నాడు హైదరాబాద్ లో నేను ఇచ్చిన ఉపన్యాసాన్ని వినడానికి టికెట్లు పెట్టారు. అయినా పెద్దసంఖ్యలో తెలంగాణ ప్రజలు తరలి వచ్చి, టికెట్లు కొని మరీ నా ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్నారు. తెలంగాణ ప్రజలు నాడు కురిపించిన ప్రేమ వర్షమే నాకు టర్నింగ్ పాయింట్ గా మారింది. అందువల్లే దేశానికి సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఇదే హైదరాబాద్, ఇదే తెలంగాణ ప్రజల ఉత్సాహం భవిష్యత్తులో మార్పును తీసుకొస్తుంది. మీ గురించి ఎంత పొగిడినా తక్కువే. మీరు వెనక్కి తగ్గరు.. ఎవరి ముందూ తలవంచరు.. తప్పకుండా గెలిచి తీరుతారు.. తెలంగాణలో విజయపతాకను ఎగురవేస్తారు’’ అని మోదీ పేర్కొన్నారు.  

ఇవి కూడా చదవండి

హైదరాబాద్లో ప్రధానికి ఘన స్వాగతం

షెడ్యూల్ టైం కంటే ముందుగానే మోడీ రాక

మోడీజీ..కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ ఏమైంది?