భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వానల దెబ్బకు నదులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం నైనిటాల్‌లో వరద దెబ్బకు పలు వీధులు అతలాకుతలం అవుతున్నాయి. రోడ్లు, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. చల్తీ నది భారీ ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. మరో ఘటనలో బద్రీనాథ్ నేషనల్ హైవేపై వెళ్తున్న ఓ కారు భారీ ప్రవాహం దెబ్బకు లోయలో పడిపోయింది. దీన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ టీమ్ అతి కష్టం మీద బయటకు తీశారు. ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామితో  ప్రధాని మోడీ మాట్లాడారు. అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, ఇప్పటివరకు ఈ వరదల కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గల్లంతయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.  

మరిన్ని వార్తల కోసం :

కేసీఆర్​ బొమ్మకు ఓట్లు పడే రోజులు పోయినయ్: ఈటల

తండ్రి ఆస్తి కొట్టేసేందుకు సైబర్ క్రిమినల్‌‌గా మారిన కొడుకు

కూరగాయలు మస్త్​ పిరమైనయ్.. ఏది కొనాలన్నా కిలో రూ. 60 పైనే