ప్రధాని మోదీ టూర్ .. సీఎం రేవంత్కు ఇన్విటేషన్

ప్రధాని మోదీ టూర్ .. సీఎం రేవంత్కు ఇన్విటేషన్

ప్రధాని మోదీ టూర్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చింది పీఎంవో. మార్చి 4, 5తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సిందిగా కోరింది. పీఎం ఇన్విటేషన్ తో ప్రధానమంత్రికి రేవంత్ స్వాగతం పలికే అవకాశం ఉంది. గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.

మార్చి 4వ తేదీన ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రానున్నారు. అక్కడి నుంచి నేరుగా అదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప చేయనున్నారు. అనంతరం బహింరగ సభలో ప్రసంగించనున్నారు.  

మార్చి 5వ తేదీన సంగారెడ్డి జిల్లాలో మోదీ పర్యటిస్తారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్తారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల గెలుపే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నాయకులు.. ఇప్పటికే యాత్రల పేరుతో జనాల్లోకి వెళ్లి ప్రాచారం చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి దూసుకుపోతోంది.