ఏపీలో పర్యటించనున్న ప్రధాని..షెడ్యూల్ ఇదే..

ఏపీలో పర్యటించనున్న ప్రధాని..షెడ్యూల్ ఇదే..

 ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం చేరుకుని అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డెరక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను సందర్శిస్తారు. ఆ భవనం మొదటి అంతస్తులో గల యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్ ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్ ను సందర్శిస్తారు. వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు.

 అనంతరం గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎక్స్- రే,బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు ఎకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలను నాటి అక్కడ కనస్ట్రక్సన్ కార్మికులతో మాట్లాడి వారితో గ్రూపు ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో మాటామంతీలో పాల్గొంటారు. అనంతరం పబ్లిక్ ఫంక్షన్‌లో ప్రధాని మోదీ పాల్గొని ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. 

తదుపరి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరక్ట్ టాక్టెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్ ను అందిస్తారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించాక.. అక్కడి నుండి ఢిల్లీకి బయలుదేరి వెళతారు అని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి అధికారులు తెలిపారు.  ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని పర్యటించే ప్రాంతమంతా ఎస్పీజీ ఆధినంలో కొనసాగనుంది.