హైదరాబాద్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

హైదరాబాద్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రేపు(నవంబర్ 11)న హైదరాబాద్ కు రానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. టూర్ లో భాగంగా మోడీ నవంబర్ 11న సాయంత్రం 4 గంటల 45 నిముషాలకు  బేగం పేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. 5 గంటల నుంచి 5.40 వరకు పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభలో పాల్గొంటారు. మళ్లీ తిరిగి 6 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. 

ప్రధాని టూర్ దృష్ట్యా శాంతిభద్రతలకు ఆటంకం కల్గకుండా  నవంబర్ 11న మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.  పంజాగుట్ట, - గ్రీన్ ల్యాండ్స్ - బేగంపేట నుండి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్లే వారు  ఆ రూట్ లో వెళ్లొద్దని సూచించారు. హైదరాబాద్ పోలీసులు పౌరులను అభ్యర్థించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం రైళ్లలో..  జూబ్లీ బస్ స్టేషన్ మీదుగా ఆర్‌టిసి బస్సులలో ప్రయాణించాలనుకునే సాధారణ ప్రయాణీకులు సకాలంలో రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని  మెట్రో రైల్ లో వెళ్ళాలని సూచించారు. 

ట్రాఫిక్ మళ్లింపు ఇలా

  • సంగీత్ x రోడ్- YMCA - పాట్నీ-  ప్యారడైజ్-  CTO-  రసూల్‌పురా-  బేగంపేట్-  బాలమ్రాయ్-  బ్రూక్ బాండ్- టివోలి- స్వీకర్ ఉపకార్-  YMCA-  సెయింట్ జాన్స్ రోటరీ
  • బోయిన్ పల్లి - తాడ్‌బండ్ - రాణిగంజ్- ట్యాంక్ బండ్ - కార్ఖానా -JBS - SBH
  • ఆర్‌టీఏ తిరుమలగిరి-  కార్ఖానా-  మల్కాజ్‌గిరి - సఫిల్‌గూడ
  • జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ -  పంజాగుట్ట - ఖైరతాబాద్-  గ్రీన్ ల్యాండ్స్ - రాజ్ భవన్