‘వియ్ బో’ నుంచి తప్పుకున్న మోడీ

‘వియ్ బో’ నుంచి తప్పుకున్న మోడీ

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ‘వియ్ బో’ నుంచి ప్రధాని నరేం ద్ర మోడీ తప్పుకున్నారు. ఆ సైట్‌లోని తన అకౌంట్‌లో ఉన్న ఫొటోలు, పోస్టులు, కామెంట్లు తొలగించారు. చైనా 59 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన వెంటనే ఆ ఆకౌంట్‌ నుంచి మోడీ వైదొలిగారని, వీఐపీ అకౌంట్‌ కావడం వల్ల యూజర్ పాలిసీ దృష్ట్యా డిలీట్‌ ప్రాసెస్‌ కాస్త లేటుగా జరిగిందని తెలిసింది. ఆ అకౌంట్‌లో 115 పోస్టులుం డగా 113 పోస్టులను మాన్యువల్ గా డిలీట్‌ చేశారు. వియ్ బోలో మోడీకి 2,44,000 మంది ఫాలొవర్లున్నారు.