
హైదరాబాద్సిటీ, వెలుగు : నిరుపేద జంటకు మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీదాస ఆంజనేయ దేవాలయంలో ఆదివారం వివాహం జరిపించారు. సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ మొగళ్లపల్లి ఉపేందర్ గురుస్వామి మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 215 మంది నిరుపేద జంటలకు పెండ్లి చేసినట్టు తెలిపారు. ఆదివారం సంగీత, అరవింద్ అనే జంటకు వివాహం జరిపించినట్టు చెప్పారు. కొత్త జంటకు బంగారు పుస్తెలు, మట్టెలు కోటగిరి సుధాకర్, ఉదయశ్రీ దంపతులు అందజేశారు.