మహమ్మద్ అజారుద్దీన్ తండ్రి కన్నుమూత

మహమ్మద్ అజారుద్దీన్  తండ్రి కన్నుమూత

భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన  తండ్రి మహమ్మద్ యూసుఫ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తుదిశ్వాస విడిచారు. రేపు బంజారాహిల్స్ లోని మస్జిద్  ఎ  బఖీలో జొహర్ ప్రార్థనల  తరువాత నమాజ్ ఎ జనాజా  అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.