గృహహింస కేసులో మహ్మద్ షమీకి ఊరట

 గృహహింస కేసులో మహ్మద్ షమీకి ఊరట

గృహహింస కేసులో భారత క్రికెటర్ మహ్మద్ షమీకి ఊరట లభించింది.  షమీ భార్య హసిన్ జహాన్ దాఖలు చేసిన ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షమీ భార్య హసిన్ 2018లో షమీతో పాటుగా అతని సోదరుడు హసిబ్‌పై గృహహింస కేసు పెట్టింది.  షమీ సోదరలు విచారణకు హాజరు కాగా ఆయన తరుపు న్యాయవాది సలీం రెహ్మాన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు.. రూ. 2 వేల పూచీకత్తుతో షమీతో పాటుగా అతని సోదరుడికి బెయిల్ మంజూరు చేసింది.  

2014  ఏప్రిల్ 7 న షమీని పెళ్లి చేసుకున్నానని, ఏడాది తర్వాత తమకు బిడ్డ పుట్టిందని జహాన్ తన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త స్త్రీ ప్రియుడని, అతను చాలా మంది మహిళలతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఇలాంటివి చేయోద్దని చెబితే షమీ తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో  పేర్కొంది. 2019 ఆగస్టు 29న అలీపూర్‌ ఏసీజేఎం కోర్టు షమీపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. అదే ఏడాది సెప్టెంబర్ 9న అలీపూర్ జిల్లా సెషన్స్ కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ను సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లో ఉంది.