Asia Cup 2025: దులీప్ ట్రోఫీ ఆడగలిగితే.. ఆసియా కప్ ఆడలేనా: సెలక్టర్లకు షమీ సూటి ప్రశ్న

Asia Cup 2025: దులీప్ ట్రోఫీ ఆడగలిగితే.. ఆసియా కప్ ఆడలేనా: సెలక్టర్లకు షమీ సూటి ప్రశ్న

సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపిక కాలేదు. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి అనుభవం దృష్టిలో ఉంచుకొని సెలక్ట్ అవుతాడని భావించినా ఈ సీనియర్ పేసర్ కు నిరాశ తప్పలేదు. టీ20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని సెలక్టర్లు పూర్తిగా యంగ్ ప్లేయర్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో టీమిండియా తరపున టీ20 మ్యాచ్ ఆడిన షమీ.. ఐపీఎల్ లో విఫలం కావడంతో ఆసియా కప్ రేస్ లో వెనకపడ్డాడు. పూర్తి ఫిట్ గా ఉన్నప్పటికీ తనను సెలక్ట్ చేయలేదని  షమీ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెలక్టర్లపై పరోక్షంగా ప్రశ్నిస్తూ తన నిరాశను వ్యక్తం చేశాడు.

ఆసియా కప్ కు ఎంపిక కాని షమీ తనను ఎందుకు ఎంపిక చేయలేదో సెలక్టర్లను వివరణ అడిగాడు. షమీ మాట్లాడుతూ.. " ఆసియా కప్ కోసం ఎంపిక చేయనందుకు నేను ఎవరినీ నిందించను. ఎవరిపైనా ఫిర్యాదు చేయను. నేను జట్టుకు సరైనవాడైతే, నన్ను ఎంపిక చేసుకోండి. కాకపోతే నాకు ఎటువంటి సమస్యలు లేవు. టీమ్ ఇండియాకు ఏది ఉత్తమమో అది చేయాల్సిన బాధ్యత సెలెక్టర్లపై ఉంది. నాకు అవకాశం లభిస్తే, నా శక్తి మేరకు నేను నా వంతు కృషి చేస్తాను. నా సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. నేను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను దులీప్ ట్రోఫీ ఆడగలిగితే, టీ20 క్రికెట్ ఎందుకు ఆడలేను?". అని ఈ టీమిండియా పేసర్ న్యూస్ 24 స్పోర్ట్స్‌తో చెప్పుకొచ్చాడు. 

►ALSO READ | సెకండ్ క్లాస్ నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టా.. వరల్డ్ ఆర్చరీ గోల్డ్ మెడల్ విన్నర్ చికిత

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రా లేకపోవడంతో షమీని ఎంపిక చేశారు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే వన్డే ఫార్మాట్ కావడం.. బుమ్రా కూడా లేకపోవడంతో షమీకి ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో షమీని నమ్ముకునే పరిస్థితిలో భారత యాజమాన్యం లేనట్టు తెలుస్తోంది. అతని ఫిట్ నెస్ తో పాటు వయసు పొట్టి ఫార్మాట్ కు సహకరించడం కష్టం.  2025లో షమీ భారతదేశం తరపున 2 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 5.3 ఓవర్లు బౌలింగ్ చేసి 9.43 ఎకానమీతో 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో ఘోరంగా విఫలం కావడం షమీకి మైనస్ గా మారింది.