బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ

బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ

అక్టోబర్ 16న ఆస్ట్రేలియా గడ్డ పై టీ20 వరల్డ్కప్ మొదలుకానుంది. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోన్న టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుని  రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడేసింది. అయితే జట్టులో ఎంపికైన జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. దీంతో స్డాండ్  బై స్థానంలో ఉన్న మహమ్మద్ షమీని ఎంపిక చేసినట్లుగా బీసీసీఐ వెల్లడించింది. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లు బ్యాకప్ గా ఉన్నట్లు పేర్కొంది.

నిజానికి బుమ్రా స్థానంలో ముందుగా దీపక్ చాహర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. కానీ అతను కూడా గాయపడటంతో షమీకి ఛాన్స్ దక్కింది. 2014లో భారత టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ షమీ.. కేవలం 17 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ టీమ్ టైటిల్ గెలవడంలో బౌలర్‌గా షమీ  కీ రోల్  పోషించాడు. షమీ 16 మ్యాచ్‌లలో 18.30 స్ట్రైక్ రేట్‌తో 20 వికెట్లు పడగొట్టాడు. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:  రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.