వన్డేల్లో అద్భుత గణాంకాలు.. పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నానని నిరూపించుకున్నాడు.. ఫామ్ లేదంటే డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చాటాడు.. జట్టులో సీనియర్ పేసర్.. బోలెడంత అనుభవం.. టీమిండియాలో ఖచ్చితంగా ఉండడానికి అర్హుడు. అయినప్పటికీ న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఇవన్నీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి చెబుతున్న మాటలు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ గా భారత జట్టులో తన మార్క్ వేసిన వేసిన షమీకి ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. షమీ ఎంత బాగా బౌలింగ్ చేసినా సెలక్టర్లు భారత జట్టుకు తన అవసరం లేదని చెప్పేస్తున్నారు.
బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం.. అదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీలు షమీ సత్తా చాటడంతో ఈ స్టార్ బౌలర్ రీ ఎంట్రీ ఖాయమనుకున్నారు. అయితే సెలక్టర్లు షమీకి మరోసారి మొండి చెయ్యి చూపించారు. మరోవైపు సిరాజ్ ను సెలక్ట్ చేసినా షమీకి మాత్రం చెక్ పెట్టారు. షమీని ఎంపిక చేయకపోవడానికి కారణం కూడా లేదు. బహుశా 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఈ బెంగాల్ పేసర్ లేకపోవచ్చు. 35 ఏళ్ళ షమీ ఎప్పుడు గాయపడతాడో తెలియదు. ఫిట్ నెస్ కాపాడుకొని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగడం కష్టమే. దీంతో షమీని సెలక్టర్లు పక్కనే పెట్టేస్తున్నారు.
Also Read : సెంచరీ చేసినా పక్కన పెట్టారు
ఐపీఎల్ లో ఘోరంగా విఫలం:
వాస్తవానికి ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడం షమీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అప్పటికే ఫిట్‌నెస్, ఫామ్ తో ఇబ్బందిపడిన షమీకి ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్ లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు. ఆ తర్వాత ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకొని నిరాశపరిచాడు. ఓవరాల్ గా షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తుంది.
చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ:
35 ఏళ్ల షమీ ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన తర్వాత గాయపడ్డాడు. ఆ తర్వాత పూర్తి ఫిట్ నెస్ సాధించి రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. నాలుగు మ్యాచ్ ల్లో 20 వికెట్లు పడగొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత టీ20 ఫార్మట్ లో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలోనూ రాణించాడు. ఏడు మ్యాచ్‌ల్లో 14.93 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
న్యూజిలాండ్ తో సిరీస్ కు భారత వన్డే జట్టు :
శుభమాన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్
