IND vs NZ: అతను టీమిండియాలో దండగ.. ఆ బౌలర్ ప్లేస్‌లో షమీని ఎంపిక చేయాల్సింది: నెటిజన్స్

IND vs NZ: అతను టీమిండియాలో దండగ.. ఆ బౌలర్ ప్లేస్‌లో షమీని ఎంపిక చేయాల్సింది: నెటిజన్స్

న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఫిట్ నెస్ నిరూపించుకున్నా.. ఫామ్ లోకి వచ్చినా ఈ సీనియర బౌలర్ ను సెలక్టర్లు మరోసారి పక్కన పెట్టారు. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం.. అదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీలు షమీ సత్తా చాటడంతో ఈ స్టార్ బౌలర్ రీ ఎంట్రీ ఖాయమనుకున్నారు. అయితే సెలక్టర్లు షమీకి మరోసారి మొండి చెయ్యి చూపించారు. షమీని ఎంపిక చేయకపోవడంతో నెటిజన్స్ ఫైరవుతున్నారు. న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికను ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణ స్థానంలో షమీని సెలక్ట్ చేస్తే బాగుండేదని తమ అభిప్రాయాన్ని చెప్పుకొస్తున్నారు. 

ప్రసిద్ కృష్ణ భారత జట్టులో ఎందుకు అని ప్రశిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ ల్లో 6కి పైగా ఎకానమీ.. వన్డేల్లో 8 కి పైగా ఎకానమీ ఉన్న ప్రసిద్ ను ఎంపిక చేసి షమీకి అన్యాయం చేస్తున్నారని నెటిజన్స్ సెలక్టర్లపై మండిపడుతున్నారు. బుమ్రాకి రెస్ట్ ఇచ్చిన్నప్పుడు కూడా షమీకి జట్టులో చోటు దక్కపోవడం విచారకరమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షమీ జట్టులోకి రావడానికి పూర్తిగా అర్హుడని.. అతను చేసిన తప్పేంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. షమీని కావాలనే ఎంపిక చేయడం లేదని కొందరు వాదిస్తున్నారు. 

ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే 21 వన్డేలు, 6 టెస్టులు, 5 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వికెట్లు తీయడంలో పర్వాలేదనిపిస్తున్నా ఎకానమీ మాత్రమే ఘోరంగా ఉంది. చివరిసారిగా గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో ప్రసిద్ కృష్ణ ఎకానమీ 8కి పైగా ఉంది. టెస్టుల్లో కూడా ఈ గుజరాత్ టైటాన్స్ పేసర్ ను అలవోకగా ఆడేస్తున్నారు. మరోవైపు షమీ పూర్తి ఫిట్ నెస్ సాధించి రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. నాలుగు మ్యాచ్ ల్లో 20 వికెట్లు పడగొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత టీ20 ఫార్మట్ లో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలోనూ రాణించాడు. ఏడు మ్యాచ్‌ల్లో 14.93 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.   

ఐపీఎల్ లో ఘోరంగా విఫలం:
 
వాస్తవానికి ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడం షమీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అప్పటికే ఫిట్‌నెస్, ఫామ్ తో ఇబ్బందిపడిన షమీకి ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్ లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు. ప్రస్తుతం కివీస్ తో వన్డే సిరీస్ కు సెలక్ట్ చేయకపోవడంతో షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తుంది.     

న్యూజిలాండ్ తో సిరీస్ కు భారత వన్డే జట్టు :

శుభమాన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్  సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్