
తెలుగు సినీ నటనా శిఖరం అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswararao) శత జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమలో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ వేడుకలకు అక్కినేని కుటుంబంతో పాటు.. అల్లు అరవింద్, మోహన్ బాబు, బ్రహ్మానందం, జయసుధ, మహేష్ బాబు, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, తదితర సినీ తారలు హాజరయ్యారు.
ఫోన్ పట్టుకొని కూర్చున్న జయసుధ ఫోన్ లాగేసిన మోహన్ బాబు. #ANRLivesOn #CelebratingANR100 pic.twitter.com/IcsDTT5RJe
— Actual India (@ActualIndia) September 20, 2023
అయితే ఈ కార్యక్రమంలో అక్కడికి వచ్చిన ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు గురించి, ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయనతో తమకున్న సాన్నిహిత్యం గురించి మాట్లాడారు. ఆ సమయంలో నటి జయసుధ తన ఫోన్ లో ఎదో చూస్తున్నారు. అది గమనించిన మోహన్ బాబు సీరియస్ గా ఆమె చేతిలో నుంచి ఫోన్ లాక్కుందామని ప్రయత్నించాడు. మోహన్ బాబు చేసిన పనికి ఎం అయోమయంలో పడిపోయిన జయసుధ.. ముందు సీరియస్ అయినా.. ఫైనల్‌గా నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.