ఆచార్య సెట్‌లో చిరంజీవిని క‌లిసిన మోహ‌న్‌బాబు

ఆచార్య సెట్‌లో చిరంజీవిని క‌లిసిన మోహ‌న్‌బాబు
టాలీవుడ్ అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తమ ఫ్రెండ్ షిప్ ను మరోసారి చాటుకున్నారు. ఇవాళ(బుధవారం) మోహన్ బాబు ‘ఆచార్య’ సెట్స్ పై ప్రత్యక్షమై చిరంజీవిని సర్ ప్రైజ్ చేశారు. చిరంజీవికి బొకే ఇచ్చి… స్నేహ‌పూర్వ‌కంగా క‌లిశారు. మిత్రుడు త‌న సినిమా సెట్స్‌కు రావ‌డంతో చిరంజీవి ఆనందంతో మోహ‌న్‌బాబును సాదరంగా ఆహ్వానించారు. ఇద్ద‌రూ కొద్దిసేపు సినిమాల‌తో పాటు వివిధ అంశాల‌పై మాట్లాడుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రంతో బిజీగా ఉండగా, మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ అనే మూవీలో నటిస్తున్నారు.