TheParadise: జడల్తో తలపడనున్న శికంజా.. శ్రీకాంత్ ఓదెల మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..

TheParadise: జడల్తో తలపడనున్న శికంజా.. శ్రీకాంత్ ఓదెల మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..

నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, నాని లుక్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే వరుస అప్డేట్స్ ఇస్తూ నాని ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచుతూ వస్తున్నారు.

ఇవాళ (సెప్టెంబర్ 27న) మరో క్రేజీ అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ని అలెర్ట్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్గా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. ‘శికంజా మాలిక్’ అనే విలన్ పాత్రలో నట విశ్వరూపం చూపిస్తారని కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చారు.

కెరీర్ ఆరంభంలో మోహన్ బాబు పలు నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్రల్లో ఆకట్టుకున్నాడు. కానీ క్రమక్రమంగా విలన్ గా నటించడం మానేశాడు. అయినప్పటికీ మోహన్ బాబు వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు ఉండడంతో.. మరోసారి విలన్గా కమ్ బ్యాక్ ఇచ్చేలా శ్రీకాంత్ డిజైన్ చేసినట్లు టాక్.

Image

ఇందులోనాని ‘జడల్’ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించనున్నట్టు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. రగ్డ్‌‌ మీసం, గెడ్డం, రెండు జడలతో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని హడల్ పుట్టించేలా ‘జడల్‌‌’ లుక్స్ ఉన్నాయి. ఈ క్రమంలో రిలీజైన జడల్(నాని).. శికంజా (మోహన్ బాబు) లుక్స్ ఫ్యాన్స్ లో మాస్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. 

Image

ఈ మూవీతో ‘కిల్’ ఫేమ్ రాఘవ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. 2026 మార్చి 26న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ,  హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ సహా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ వరల్డ్‌‌ మూవీగా రిలీజ్ చేస్తున్నారు.