ప్రొఫెసర్ విశ్వామిత్ర

ప్రొఫెసర్ విశ్వామిత్ర

లాంగ్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన మోహన్‌‌‌‌ బాబు త్వరలో ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ విశ్వామిత్ర అనే డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తో రాబోతున్నారు. తన కూతురు లక్ష్మీ ప్రసన్నతో కలిసి ఆయన నిర్మిస్తోన్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ ఇద్దరూ కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ప్రతీక్ ప్రజోష్ దర్శకుడు. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌‌‌‌ను రివీల్ చేసిన టీమ్, తాజాగా ఇందులో మోహన్‌‌‌‌ బాబు లుక్‌‌‌‌ను రిలీజ్ చేశారు. తన ఆలోచనలతో, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల డైనమిక్ సైకియాట్రిస్ట్‌‌‌‌, ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ విశ్వామిత్ర అంటూ ఆయన లుక్‌‌‌‌ను రివీల్ చేశారు.

ఇక ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో గంభీరమైన లుక్‌‌‌‌లో ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు మోహన్ బాబు. తమిళ నటుడు సముద్రఖని కమిషనర్‌‌‌‌‌‌‌‌ చలపతిగా కీలకపాత్రను పోషిస్తున్నాడు. అలాగే మలయాళంలో విభిన్నమైన పాత్రలు పోషించిన సిద్ధిక్‌‌‌‌.. ఫార్మా టైకూన్ బలరాం వర్మగా నటిస్తున్నారు. డాక్టర్ మిథిలగా చైత్ర శుక్ల నటిస్తోంది. విశ్వంత్ హీరోగా నటిస్తున్నాడు. లిజో కె జోస్ సంగీతం అందిస్తున్నాడు.