నాగ్ పూర్ లో ఓటు వేసిన మోహన్ భగత్

నాగ్ పూర్ లో ఓటు వేసిన మోహన్ భగత్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన భగత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగ్ పూర్ లోని 216 పోలింగ్ బూత్ లో ఓటేసిన మోహన్ భగత్ దేశ ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని అన్నారు. మహారాష్ట్రలో ఈ రోజు ఏడు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. పొద్దున 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉదయం నుంచే  ఓటర్లు పోలింగ్ కేంద్రాల వల్ల లైన్లు కట్టారు. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతోంది.

జమ్ము కశ్మీర్ లో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఓటేయడానికి పొద్దున నుండే బారులు తీరారు ఓటర్లు. గులాం అనే కశ్మీరి ఓటర్ మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ ప్రజలు సామరస్యాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.తమ ప్రాంతంలో శాంతిని స్థాపించేవారికి కశ్మీర్ ప్రజలు పట్టం కడతారని అన్నారు. ఈయన జమ్ము కశ్మీర్ లోని జండిపుర లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.