
హైదరాబాద్, వెలుగు: ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ( ఈఎన్సీ) గా మోహన్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం స్టేట్ రోడ్స్ చీఫ్ ఇంజినీర్ గా, ఆర్డీసీ (రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఎండీగా మోహన్ నాయక్ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈఎన్సీగా పదోన్నతి కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.