మోహిత్ పెడాడ, శృతి శంకర్ జంటగా రాజేష్ నాయుడు దర్శకత్వంలో ఎం.బి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బిచ్చు నాయక్ నిర్మిస్తున్న చిత్రం ‘2కె లవర్స్’. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టగా, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి టీమ్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ ‘ తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్‌తో సినిమాని రూపొందిస్తున్నాం.
ఆద్యంతం వినోదభరితంగా మూవీ ఉంటుంది. కథను అందించిన రసూల్‌కు థ్యాంక్స్’ అని చెప్పాడు. ఇదొక కొత్త ప్రేమ కథ అని, రెగ్యులర్ సినిమాల్లా ఉండదని మోహిత్ అన్నాడు. ఈ చిత్రంలో ఎమోషన్‌తో పాటు కామెడీ కూడా కావాల్సినంత ఉంటుందని శృతి శంకర్ చెప్పింది. తెలంగాణ యాసలో ఇది వరకు చూడని ప్రేమ కథ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమా ఉండబోతోందని నిర్మాత బిచ్చు నాయక్ అన్నారు. సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, రమ్య పొందూరి, శివన్నారాయణ, ఆమని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
