ఈ గినీ పిగ్​ బాస్కెట్​ బాల్​ ప్లేయర్​

ఈ గినీ పిగ్​ బాస్కెట్​ బాల్​ ప్లేయర్​

ఈ ఫొటోలో కనిపిస్తున్న బుజ్జి యానిమల్​​ గినీ పిగ్​... ఎలుక జాతికి చెందినది ఇది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. బాస్కెట్​ బాల్​ అంటే భలే ఇష్టం దీనికి. ఇష్టపడటమే కాదు ఆడుతుంది కూడా. ఆశ్చర్యంగా అనిపించినా.. దాని ఆటతో​ గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​కి ఎక్కింది ఈ గినీ పిగ్​. యానిమల్స్​కి​ కూడా గిన్నిస్​ బుక్​లో చోటు ఉంటుందా?  అనే డౌట్​ వస్తుంది కదా!  అయితే వాటికి కూడా చోటు ఉంటుందని చెప్తున్నారు  గిన్నిస్​బుక్ వాళ్లు. వాటి స్థాయికి తగ్గట్టుగానే పోటీలు పెడతాం అంటున్నారు. ఇంతకీ ఈ గినీ పిగ్​ ఎందుకు రికార్డుల్లోకి ఎక్కిందంటే..

ఈ క్యూట్​ గినీ పిగ్​ పేరు మోలీ. హంగేరిలోని  డోంబోవర్​లో యజమాని ఎమ్మా ముల్లర్​తో కలిసి ఉంటుంది. దీనికి చిన్నప్పట్నించీ ఆటలంటే ఇష్టమట. బాస్కెట్​ బాల్​ అంటే ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్​ చూపించేదట. అది గమనించిన ముల్లర్,​ మోలీకి ఆ ఆటలో ట్రైనింగ్​ ఇచ్చింది. అదే దాన్ని గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​ వరకు తీసుకెళ్లింది. 30 సెకన్లలో నాలుగు బాస్కెట్​ బాల్ స్లమ్​ డక్స్​ కొట్టింది మోలీ​. దానికి సంబంధించిన వీడియోని రీసెంట్​గా షేర్​ చేసింది​ గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​. ఆ వీడియోలో 4.4 సెంటీ మీటర్లున్న మినియేచర్​ బాల్​ని హూప్​లో వేస్తుంటుంది మోలీ.  ఆ బాల్​ని ముల్లర్​ మళ్లీ మునుపటి పొజిషన్​లోకి తీసుకొచ్చి.. ‘వెనక్కివెళ్లు మోలీ’ అని అరుస్తుంటుంది. ఆ వెంటనే.. మళ్లీ వెనక్కి వెళ్లి బాల్​ తీసుకొచ్చి హూప్​లో వేస్తుంది మోలీ. ఈ వీడియోని ఇప్పటికే లక్షలమంది చూశారు.