మస్క్ కు మరో ఎదురుదెబ్బ..మళ్లీ పేలిన స్టార్ షిప్ రాకెట్

మస్క్ కు మరో ఎదురుదెబ్బ..మళ్లీ పేలిన స్టార్ షిప్ రాకెట్
  •  
  •     ఫైర్ టెస్ట్ నిర్వహిస్తుండగా ఘటన


వాషింగ్టన్: స్పేస్ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అధినేత ఎలాన్ మస్క్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కంపెనీకి చెందిన స్టార్ షిప్ 36 రాకెట్ ఫైర్ టెస్ట్  సమయంలో పేలిపోయింది. దీంతో స్టార్ షిప్  లాంచింగ్  మళ్లీ  వాయిదా పడింది. బుధవారం రాత్రి 11 గంటలకు టెక్సస్ లోని స్పేస్ఎక్స్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం కోసం ఇంజన్లను మండించారు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో రాకెట్  పేలిపోయింది. 

పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో చిన్నపాటి భూకంపం వచ్చినట్లయింది. ఆకాశంలో భారీ అగ్నిగోళంలా మంటలు ఏర్పడ్డాయి. రాకెట్ శకలాలు ఆ ప్రాంతమంతా ఎగిరిపడ్డాయి. దీంతో స్పేస్ఎక్స్  కంపెనీ తదుపరి లాంచింగ్  కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసింది. ఈ ఘటనలో సిబ్బందికి గాయాలు కాలేదని వెల్లడించింది. దీనిపై మస్క్  స్పందిస్తూ.. ఇది చిన్నపాటి సమస్యేనని అన్నారు. అయితే, ఇంతకుముందు కూడా స్టార్ షిప్ రాకెట్ వరుసగా రెండు సార్లు ఫ్లైట్ టెస్టుల్లోనే పేలిపోయాయి.